1. అత్యధిక కాలం అంతరిక్షంలో గడిపిన ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్

భారతీయ మూలాలున్న సునీత మరికొన్ని గంటల్లో భూమిని చేరుతారు

2. గుజరాత్‌ దీపక్ పాండ్యా, స్లోవేకియాకు చెందిన బొన్నీని అమెరికాలో పెళ్లిచేసుకున్నారు.

వారిద్దరి కుమార్తెనే.. సునీత విలియమ్స్

3. సునీత కేరీర్‌ నేవీలో హెలికాప్టర్ పైలట్‌గా ప్రారంభమైంది.

ఆమె ౩౦ రకాల ఎయిర్ క్రాప్ట్‌లను నడిపారు.

4.ఫెడరల్ మార్షల్ అయిన మైఖేల్ జే విలియమ్స్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

పెళ్లి తర్వాతనే తన డ్రీమ్ అయిన నాసాలో చేరారు

5. మూడు సార్లు స్పేస్ వాక్ చేయటంతో పాటు 50 గంటల పాటు స్పేస్ వాక్ చేసిన మహిళగా రికార్డు సృష్టించారు.

స్పేస్‌లో అత్యధిక సమయం గడిపిన రెండో మహిళ సునీత విలియమ్స్

6. మూడోసారి ఇంటర్ నేషనల్ స్పేస్ స్టేషన్ కు వెళ్లిన సునీత.

అనుకోకుండా ఈసారి తొమ్మిది నెలల పాటు స్పేస్ స్టేషన్ లోనే ఉండిపోవాల్సి వచ్చింది

7. సునీత స్పేస్‌లోకి తనతో భగవద్గీతను, గణేష్ ప్రతిమను తీసుకెళ్లారు.

అవి తనకు ధైర్యాన్నిస్తాయని చెప్పారు.

8. ఐపాడ్ లో లతా మంగేష్కర్ పాటలు పెట్టుకుని డాన్స్ చేస్తారు.

అంతరిక్షంలో ఆలూ సమోసా చేయడానికి ట్రై చేశారు

9. అంతరిక్షంలోనే మారథాన్‌ను కూడా పూర్తి చేసిన తొలి వ్యక్తి సునీత విలియమ్స్

ట్రయథ్లాన్ కూడా కంప్లీట్ చేశారు.

భారతీయ మూలాలున్న ఆమె తరచుగా ఇండియాను సందర్శిస్తూనే ఉంటారు

మరోసారి భారత్ రమ్మని ప్రధాని మోదీ లేఖ రాశారు