న్యూ అప్​డేట్

వాట్సాప్​లో న్యూ ఫీచర్.. ఇకపై చాట్ ఈవెంట్ కూడా

Published by: Geddam Vijaya Madhuri

వాట్సాప్​ మరో అద్భుతమైన ఫీచర్​తో రాబోతుంది. చాట్​ ఈవెంట్​తో వినియోగదారులకు అందుబాలోకి రానుంది.

ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్​స్టెంట్​ మెసేజింగ్ యాప్​గా వాట్సాప్​కు మంచి క్రేజ్ ఉంది. దీనిలో 5 బిలియన్లకు పైగా వినియోగదారులున్నారు.

ఈ అంశాన్నే దృష్టిలో పెట్టుకుని యూజర్స్​కి అనుగుణంగా కొత్త ఫీచర్లతో అప్​డేట్ అవుతూ ఉంది వాట్సాప్.

వినియోగదారుల మెప్పుకోసం, వారి అనుభవాన్ని మెరుగుపరచడం కోసం వాట్సాప్ కృషి చేస్తుంది.

అన్ని పనులు ఒకే యాప్​ నుంచి చేయగలిగేలా దీనిని డిజైన్ చేస్తూ ఫీచర్లు జోడిస్తున్నారు.

దీనిలో భాగంగానే వాట్సాప్​ చాట్​ ఈవెంట్​కు మరింతమంది యూజర్స్​ని యాడ్​ చేసేలా న్యూ ఫీచర్​ను తీసుకురానుంది.

WABetainfo అనే వెబ్​సైట్​లో WhatsApp గురించిన ఈ అప్​డేట్​ను లీక్​ చేశారు.

ఈ న్యూ ఫీచర్​ ద్వారా వాట్సాప్ వినియోగదారులు చాట్​ ఈవెంట్​ను క్రియేట్ చేయగలుగుతారు. అలాగే ఇతరులను కూడా యాడ్ చేయగలుగుతారు.

ప్రస్తుతం బీటా టెస్టర్లకు మాత్రమే ఈ న్యూ ఫీచర్ అందుబాటులో ఉంది.