2జీ, 3జీ సర్వీసులను నిలిపివేయాల్సిందే కేంద్ర ప్రభుత్వాన్ని టెలికాం కంపెనీ జియో కోరింది. దీని కారణంగా చాలా వరకు ఖర్చులు మిగులుతాయని పేర్కొన్నారు. అలా జరిగితేనే మోస్ట్ అడ్వాన్స్‌డ్ 4జీ, 5జీ నెట్‌వర్క్‌ల్లోకి మైగ్రేట్ అవుతారని కంపెనీ తెలిపింది. 2జీ, 3జీ నెట్‌వర్క్‌లను మూసి వేస్తే అనవసరమైన నెట్‌వర్క్ కాస్ట్‌లను అవాయిడ్ చేయవచ్చని అంటోంది. కానీ దీన్ని వొడాఫోన్ ఐడియా కాస్త వ్యతిరేకించింది. 2జీ నెట్‌వర్క్‌ను ఉపయోగించే ప్రజలు ఇంకా చాలా మంది ఉన్నారని, కాబట్టి ఇది సరైన నిర్ణయం కాదంది. 4జీ, 5జీ లాంటి టెక్నాలజీలు వారికి దూరంగా ఉన్నాయిని తెలిపింది. తక్కువ ఆదాయం ఉన్నవారికి 5జీ అనేది ఖరీదైనదిగా మారుతుందని అభిప్రాయపడింది. యి. ప్రస్తుతం మనదేశంలో రిలయన్స్ జియో నంబర్ వన్ స్థానంలో ఉంది. రెండో స్థానంలో ఎయిర్‌టెల్, మూడో స్థానంలో వొడాఫోన్ ఐడియా ఉన్నాయి.