ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆన్‌లైన్‌లో పేమెంట్ చేయటానికి ఎక్కువ సమయం పట్టదు. జేబులో నుంచి ఫోన్ తీసి క్షణాల్లో పేమెంట్ పూర్తి చేయవచ్చు. 2016లో భారత్ తీసుకువచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్‌నే (యూపీఐ) దీనికి కారణం. అనంతరం స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ యూపీఐ యాప్స్ వాడుతున్నారు. యూపీఐ కేవలం భారత్‌లోనే కాదు అనేక దేశాల్లో ప్రసిద్ధి పొందింది. ఈ పేమెంట్ సిస్టంను ఎన్నో దేశాల్లో లాంచ్ చేశారు కూడా. శ్రీలంక, మారిషస్‌ల్లో కూడా యూపీఐ ఇటీవలే లాంచ్ అయింది. దీంతో అక్కడి ప్రజలు కూడా సులభంగా చెల్లింపులు చేయవచ్చు. ఇప్పటివరకు యూపీఐ ఏడు దేశాల్లో అందుబాటులో ఉంది. ఫ్రాన్స్, యూఏఈ, సింగపూర్, నేపాల్, శ్రీలంక, భూటాన్, మారిషస్‌ల్లో యూపీఐ అందుబాటులో ఉంది.