ఎప్పుడైనా క్యూఆర్ కోడ్‌ను సరిగ్గా గమనించారా? ఆ కోడ్ అంతా బాగా స్కాటర్ అయిపోయి ఉంటుంది కానీ సరిగ్గా స్కాన్ అవుతుంది. క్యూఆర్ కోడ్ ఫుల్ ఫాం ‘క్విక్ రెస్పాన్స్ కోడ్’. ఇది ఒక మెషీన్ రీడబుల్ లేబుల్. దీన్ని కంప్యూటర్ సరిగ్గా అర్థం చేసుకుంటుంది. క్యూఆర్ కోడ్‌ను ‘డెన్సో వేవ్’ అనే సంస్థ కనిపెట్టింది. కంపెనీలోని వివిధ భాగాలను ట్రాక్ చేయడానికి మసహిరో హారా అనే ఇంజినీర్ సృష్టించాడు. కానీ సమయంతో పాటు దాని ఉపయోగం కూడా పెరిగింది. తర్వాత దాన్ని కమర్షియలైజ్ కూడా చేశారు. క్యూఆర్ కోడ్‌ను ఏ డైరెక్షన్‌లో అయినా స్కాన్ చేయవచ్చు. ఏ క్యూఆర్ కోడ్ గమనించినా దానికి మూడు కార్నర్లలో చదరాలు ఉంటాయి.