మీ కంప్యూటర్ లేదా మొబైల్ బ్రౌజర్‌లో జీమెయిల్ ఓపెన్ చేసి, మీ అకౌంట్‌తో లాగిన్ అవ్వండి.

Published by: Raja Sekhar Allu
Image Source: X.com

స్క్రీన్ కుడి వైపు పైభాగంలో ఉన్న 'సెట్టింగ్స్' గేర్ ఐకాన్‌పై క్లిక్ చేయండి.

Image Source: X.com

అక్కడ కనిపించే 'See all settings' అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.

Image Source: X.com

సెట్టింగ్స్ మెనూలో పైన ఉన్న ట్యాబ్‌లలో 'Accounts and Import' అనే విభాగానికి వెళ్లండి.

Image Source: Pixabay

అందులో 'Send mail as' అనే సెక్షన్‌ను వెతకండి. అక్కడ మీ ప్రస్తుత పేరు కనిపిస్తుంది.

Image Source: X.com

మీ పేరు పక్కనే ఉన్న 'edit info' అనే లింక్‌పై క్లిక్ చేయండి. ఒక కొత్త చిన్న విండో ఓపెన్ అవుతుంది.

Image Source: X.com

అక్కడ ఉన్న బాక్సులో మీరు ఏ పేరునైతే కొత్తగా సెట్ చేయాలనుకుంటున్నారో ఆ పేరును టైప్ చేయండి.

Image Source: X.com

పేరు మార్చిన తర్వాత క్రింద ఉన్న 'Save Changes' బటన్‌పై క్లిక్ చేయండి.

Image Source: Pixabay

ఇప్పుడు మీరు ఎవరికైనా మెయిల్ పంపితే, పాత పేరుకు బదులుగా మీరు సెట్ చేసిన కొత్త పేరు కనిపిస్తుంది.

Image Source: Pixabay

ఇది కేవలం మీ డిస్‌ప్లే పేరును మాత్రమే మారుస్తుంది. మీ ఒరిజినల్ ఈమెయిల్ అడ్రస్ (ఉదాహరణకు: abc@gmail.com) మాత్రం మారదు.

Image Source: Unsplash

ఒకవేళ ఈమెయిల్ అడ్రస్ మార్చాలంటే కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సిందే.

Image Source: Unsplash