మీరు మార్చాలనుకుంటున్న కొత్త నంబర్ గల సిమ్ కార్డ్ మీ ఫోన్‌లో ఉండాలి.

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

భద్రత కోసం ముందుగా మీ పాత నంబర్‌తో ఉన్న చాట్స్‌ను గూగుల్ డ్రైవ్ లేదా ఐక్లౌడ్‌లో Settings > Chats > Chat Backup ద్వారా బ్యాకప్ చేయండి.

Image Source: pexels

వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి, Account పైన క్లిక్ చేసి, అందులో ఉన్న Change Number ఆప్షన్‌ను ఎంచుకోండి.

Image Source: pexels

మొదటి బాక్సులో మీ పాత నంబర్, రెండో బాక్సులో మీ కొత్త నంబర్ (కంట్రీ కోడ్‌తో సహా) నమోదు చేయండి.

Image Source: pexels

నోటిఫై కాంటాక్ట్స్ నంబర్ మార్చినట్లు మీ స్నేహితులకు తెలియజేయాలనుకుంటే ఈ ఆప్షన్‌ను ఆన్ చేయండి.

Image Source: pexels

మీరు ఉన్న గ్రూపులన్నింటికీ మీరు నంబర్ మార్చినట్లు ఆటోమేటిక్‌గా మెసేజ్ వెళ్తుంది.

Image Source: pexels

మీరు ఎంటర్ చేసిన కొత్త నంబర్‌కు ఆరు అంకెల OTP వస్తుంది. దానిని ఎంటర్ చేసి వెరిఫికేషన్ పూర్తి చేయండి.

Image Source: pexels

వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే మీ పాత నంబర్‌లోని చాట్స్, ప్రొఫైల్ ఫోటో, గ్రూపులు అన్నీ ఆటోమేటిక్‌గా కొత్త నంబర్‌కు మారిపోతాయి.

Image Source: pexels

ఈ ప్రక్రియ పూర్తయ్యాక, వాట్సాప్ సర్వర్‌ల నుండి మీ పాత నంబర్‌తో ఉన్న అకౌంట్ ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతుంది.

Image Source: pexels

భద్రత కోసం మీ కొత్త నంబర్‌కు కూడా Two-step verification సెట్ చేసుకోవడం మర్చిపోకండి.

Image Source: pexels