క్రికెటర్ రాహుల్ చాహర్ (Rahul Chahar) ఓ ఇంటివాడయ్యాడు! తన ఫియాన్సీ ఇషానీ జోహార్‌ను (Ishani Johar) పెళ్లి చేసుకున్నాడు. ఇషానీ జోహార్ ఒక ఫ్యాషన్ డిజైనర్ మార్చి 9న గోవాలో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది. మార్చి 12న రిసెప్షన్ ఉంటుందని సమాచారం. 2019లో ఇషానీతో రాహుల్‌కు ఎంగేజ్‌మెంట్ జరిగింది. పెళ్లి తర్వాత 'Our Happily ever after!!' అంటూ రాహుల్ కామెంట్ పెట్టాడు. ప్రస్తుతం రాహుల్ చాహర్ వయసు 22 ఏళ్లు. టీమ్‌ఇండియా తరఫున ఈ యువ స్పిన్నర్ 6 టీ20 మ్యాచులాడి ఏడు వికెట్లు తీశాడు. వీరి మెహందీ వేడుక సందడిగా సాగింది