Image Source: @yoursthelegend Instagram

ప్రముఖ తమిళ హీరో, లెజెండ్ స్టోర్స్ యజమాని శరవణన్ తర్వాతి సినిమాకు రెడీ అయ్యారు.

Image Source: @yoursthelegend Instagram

తమిళ నాట శరవణ స్టోర్స్ అంటే తెలియని వారు ఉండదంటే అతిశయోక్తి కాదు. అవి చాలా ఫేమస్ అన్న మాట.

Image Source: @yoursthelegend Instagram

ఈ స్టోర్స్ అధినేత శరవణన్ 2022లో సినిమాల్లో అరంగేట్రం చేశారు. ‘ది లెజెండ్’ అనే సినిమాతో వెండితెర మీదకు వచ్చేశారు.

Image Source: @yoursthelegend Instagram

కానీ ‘ది లెజెండ్’కు క్రిటిక్స్ నుంచి విపరీతమైన నెగిటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చింది.

Image Source: @yoursthelegend Instagram

బాక్సాఫీస్ దగ్గర కూడా ‘ది లెజెండ్’ ఆశించిన వసూళ్లు రాబట్టడంలో విఫలం అయింది.

Image Source: @yoursthelegend Instagram

జేడీ, జెర్రీ దర్శక ద్వయం ఈ సినిమాకు డైరెక్షన్ చేశారు.

Image Source: @yoursthelegend Instagram

సినిమాటోగ్రాఫర్ వేల్‌రాజ్, ఎడిటర్ రూబెన్, మ్యూజిక్ డైరెక్టర్ హారిస్ జయరాజ్ వంటి దిగ్గజ టెక్నీషియన్లు ఈ సినిమాకు పని చేశారు.

Image Source: @yoursthelegend Instagram

ఈ సినిమాలో ఊర్వశి రౌతేలా, గీతిక హీరోయిన్లుగా నటించారు.

Image Source: @yoursthelegend Instagram

లెజెండ్ వచ్చిన ఏడాదిన్నర తర్వాత శరవణన్ కొత్త సినిమాకు రెడీ అయ్యారు.

Image Source: @yoursthelegend Instagram

కొత్త సినిమా గురించిన వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు.