తమన్నా భాటియా, విజయ్ వర్మ కలిసి ముంబైలో ఫొటోగ్రాఫర్ల కంటపడ్డారు. వీరిద్దరూ ఒకే కారులో డిన్నర్‌కు వెళ్తూ కనిపించినట్లు తెలుస్తోంది. ‘ఎంసీఏ’ సినిమాలో విలన్‌గా నటించిన విజయ్ వర్మ బాలీవుడ్‌లో బిజీగా మారుతున్నాడు. ‘మిర్జాపూర్’ వెబ్ సిరీస్‌లో కూడా కీలకపాత్రలో కనిపించాడు. ఇప్పుడు తమన్నా దగ్గర కూడా చేతి నిండా సినిమాలు ఉన్నాయి. రజనీకాంత్ ‘జైలర్’, చిరంజీవి ‘భోళా శంకర్’ల్లో తమన్నా నటిస్తున్నారు. దీంతోపాటు ‘బాంద్రా’ అనే మలయాళం సినిమాలో కూడా కనిపించనున్నారు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, హాట్‌స్టార్ వెబ్ సిరీస్‌ల్లో కూడా తమన్నా నటించారు.