ప్రయోగాల సింగీతం - ఈ పది చిత్రాలు మరుపురాని అద్భుతాలు! మయూరి: ఇది క్లాసికల్ డ్యాన్సర్ సుధా చంద్రన్ బయోపిక్. అప్పటి వరకు బయోపిక్ అనే కాన్సెప్ట్ ఎవరికీ తెలియదు. పుష్పకవిమానం: ఒక్క డైలాగ్ కూడా లేకుండా రూపొందిన సినిమా ఇది. ఇందులో ఎవరు ఎవరితో మాట్లాడుకోరు. ఆదిత్య 369: కాలంతో ప్రయాణం చేయాలనే విచిత్ర ఆలోచనలో నుంచి పుట్టిన ఈ చిత్రం అద్భుత విజయాన్ని అందుకుంది. విచిత్ర సోదరులు: మరుగుజ్జు పాత్రలో కమల్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మేడమ్: రాజేంద్ర ప్రసాద్ లేడీ గెటప్ లో నటించిన ఈ చిత్రం అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. భైరవద్వీపం: చందమామ కథను తెలుగు తెరపై ఆవిష్కరించిన అద్భుత చిత్రం. శ్రీకృష్ణార్జున విజయం: శ్రీకృష్ణుడు, పాండవుల కథని చిత్రంగా తెరకెక్కించి తానేంటో నిరూపించుకున్నారు సింగీతం. వెల్‌కమ్ ఒబామ: సరోగసీ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఇద్దరు తల్లులు, ఒక బాబు మధ్య కథను సినిమాగా తీశారు. సన్ ఆఫ్ అల్లాదీన్: అప్పట్లో సింగీత దర్శకత్వం వహించిన ఈ యానిమేషన్ చిత్రాన్ని, చాలా ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శించారు. గటోత్కచ్: సింగీతం తెరకెక్కించిన మరో యానిమేషన్ మూవీ ఇది. ఘటోత్కచుడి క్యారెక్టర్ ని యానిమేషన్ లో చూపించారు.