టీ20 ప్రపంచకప్‌లో మరో సంచలనం నమోదైంది. థ్రిల్లర్‌లా సాగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను జింబాబ్వే ఒక్క పరుగుతో ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. అనంతరం పాకిస్తాన్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 129 పరుగులకే పరిమితం అయింది. ఈ ఓటమితో పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు క్లిష్టంగా మారాయి. ఇక నుంచి ప్రతి మ్యాచ్ గెలవడంతో పాటు మిగతా జట్ల ఫలితాలపై కూడా ఆధార పడాల్సి ఉంటుంది. టాస్ గెలిచిన జింబాబ్వే మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. షాన్ విలియమ్సన్ (31: 28 బంతుల్లో, మూడు ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పాకిస్తాన్ బౌలర్లలో మహ్మద్ వసీం జూనియర్ నాలుగు వికెట్లు తీశాడు. పాకిస్తాన్ బ్యాటర్ షాన్ మసూద్ (44: 38 బంతుల్లో, మూడు ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.