అత్యావశ్యక పోషకాల్లో విటమిన్ బి12 ఒకటి. అది తగ్గితే చాలా రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి.

విటమిన్ బి12 తగ్గితే అనిమియా కూడా ఏర్పడుతుంది. చర్మం పాలిపోయి కనిపించడం మొదటి లక్షణం.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. దీనిని డిస్పెనియా అంటారు.

తరచుగా కళ్లు తిరుగుతాయి. నడుస్తున్నపుడు బ్యాలెన్స్ తప్పుతుంది. ఇది నాడీ సంబంధ సమస్య.

అప్పుడప్పుడు తిమ్మిరి వంటి భావన కలుగుతుంది. ఇది కూడా బి12 లోపం వల్ల నాడీ వ్యవస్థ ప్రభావితమవుతుంది.

తరచుగా మతిమరుపు రావడం. సమయస్పూర్తి తగ్గడం వంటివి కూడా జరుగుతాయి.

త్వరగా చికాకు పడడం, ఆందోళనగా ఉండడం, డిప్రెషన్ వంటి సైకాలజికల్ సమస్యలు కూడా వస్తాయి.

నోటిలో అల్సర్లు కూడా వస్తాయి. నాలుక కొంచెం ఎక్కువ సున్నితంగా ఉంటుంది.



ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!



Images courtesy : Pexels