ఈ లక్షణాలు కనిపిస్తే ఐరన్ లోపం ఉన్నట్టే



శరీరంలో ఇనుము లోపిస్తే ఆరోగ్యపరిస్థితి రోజురోజుకి దిగజారుతుంది.



ఇనుము లోపించడం వల్ల అనీమియా వస్తుంది. దీన్నే తెలుగులో రక్త హీనత అంటారు.



శరీరంలో అధిక శాతం ఐరన్ నిల్వ ఉండేది హిమోగ్లోబిన్లోనే. అలాగే ఎముక మజ్జలో, ప్లీహంలో, కాలేయంలో కూడా నిల్వ ఉంటుంది.



ఐరన్ తగ్గితే కొన్ని ప్రత్యేక లక్షణాలు బయటపడతాయి.



చర్మం పాలిపోయినట్టు అవ్వడం



శక్తిహీనంగా కావడం, త్వరగా అలసిపోయినట్టు అనిపించడం, రోజంతా నీరసంగా అనిపించడం

గుండె కొట్టుకునే రేటు పెరగడం

గొంతు వాపు

ధూళి, ఐస్ ముక్కలు వంటివి తినాలన్న వింత కోరికలు కలగడం

మెంతికూర, పాలకూర, బచ్చలి కూర, పచ్చి బఠాణీలు, చిక్కుళ్లు, బీన్స్, డ్రైఫ్రూట్స్, చిలగడ దుంపలు, గుడ్డు, చికెన్, బెల్లం, కొమ్ము శెనగలు వంటివి తింటే ఐరన్ లభిస్తుంది.