మార్చి 31 గురువారం రాశిఫలాలు



మేషం
ఈ రోజు మేషరాశివారికి మిశ్రమఫలితాలున్నాయి. ఎవరితోనైనా వివాదాలు రావొచ్చు. ఒత్తిడికి లోనవుతారు. కాస్త ఓపికగా వ్యవహరించండి. ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. విలువైన పత్రాలు జాగ్రత్త. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి.



వృషభం
ఈ రాశివారికి పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేస్తుంది. ఇంటి మరమ్మతులకు డబ్బు ఖర్చుచేస్తారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారికి ఇదే మంచిసమయం. స్నేహితుల నుంచి శుభవార్తలు వింటారు. అధికారులతో మీ సంబంధాలను స్నేహపూర్వకంగా ఉంచుకోండి.



మిథునం
ఈరోజు మిథున రాశివారు శుభవార్తలు వింటారు. కుటుంబ పనుల్లో బిజీగా ఉంటారు. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. అనవసరమైన కార్యకలాపాలను విస్మరించండి. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. సహోద్యోగులు మీ ప్రవర్తనకు ముగ్ధులవుతారు.



కర్కాటకం
ఈ రాశి వారికి ఉద్యోగ స్థలంలో ఒత్తిడి ఉంటుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బంది పడతారు. విద్యార్థులు చదువుపై దృష్టిసారించాలి. వ్యాపారులకు సాధారణంగా ఉంటుంది. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి.



సింహం
సన్నిహిత బంధువుల నుంచి విచారకరమైన వార్తలను అందుకుంటారు. కార్యాలయంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సోమరితనం వదలిపెట్టండి.తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. దాంపత్య జీవితంలో సంతోషం తగ్గుతుంది. మిత్రుల నుంచి ఆశించిన సహకారం లభించదు.



కన్యా
పాత మిత్రులను కలుసుకునే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. ఆర్థిక ప్రగతికి అవకాశాలున్నాయి. న్యాయపరమైన అడ్డంకులను తొలగించుకోవడంలో విజయం సాధిస్తారు. ప్రస్తుతం మీరున్న రంగంపై దృష్టి సారిస్తే ముందుకు పోగలుగుతారు.



తుల
వ్యాపారంలో పెద్ద ఒప్పందాలను పూర్తి చేస్తారు. అప్పుగా తీసుకున్న డబ్బు ఈరోజు తిరిగి రావొచ్చు. ఆరోగ్య పరంగా చాలా ఫిట్‌గా ఉంటారు. పాత పనులు పూర్తి చేయాలనే హడావుడిలో ఉంటారు. కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.



వృశ్చికం
మీరు అనేక మూలాల నుంచి ఆదాయం పొందుతారు. కార్యాలయంలో వాతావరణం కొంత అనుకూలంగా ఉండదు. గృహ జీవితంలో ప్రేమ, సామరస్యం పెరుగుతుంది. మీరు షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా లాభాలు పొందుతారు.



ధనుస్సు
ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. విమర్శల కారణంగా ఒత్తిడికి లోనవుతారు. అసంపూర్తిగా ఉన్న వ్యాపారం సమస్యలను కలిగిస్తుంది. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి. ప్రత్యర్థులు మిమ్మల్ని గందరగోళానికి గురిచేయవచ్చు.



మకరం
వ్యాపార పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. మీరు కొత్త వనరుల నుంచి ప్రయోజనం పొందుతారు. ముఖ్యమైన లక్ష్యాలను నెరవేర్చుకునే దిశగా పయనిస్తారు.ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తుల కల నిజమవుతుంది.



కుంభం
బంధువులను కలుస్తారు. మీ ఆరోగ్యం క్షీణించవచ్చు. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. కార్యాలయంలో సహోద్యోగులతో సత్సంబంధాలు కలిగి ఉంటారు.



మీనం
ఈరోజు విహారయాత్రకు వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. కొత్త వ్యక్తులతో సమావేశం అవుతారు. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. పాత జ్ఞాపకాలను స్నేహితులతో పంచుకుంటారు.ఓ శుభవార్త వింటారు.