ఎర్రటి ఎండల్లో బీర్ తాగడం మంచిదేనా? వేసవిలో తాగే పానీయాల జాబితాలో బీరు కూడా ఒకటి. నిజానికి నీళ్లకు మించిన దివ్యౌషధం మాత్రం బీరు కాదు. ఆల్కహాల్ ఉన్న బీరు తాగడం వల్ల వేసవిలో ఇంకా సమస్య పెరుగుతుంది. దాహం అధికమవుతుంది. ఆల్కహాల్ లేని బీర్ వల్ల మాత్రం మంచి ప్రయోజనాలే ఉన్నాయి. వేసవిలో తాగాలనిపిస్తే ఆల్కహాల్ లేని బీర్ తాగాలి. వారానికి ఒకటి నుంచి మూడు సార్ల వరకు తాగొచ్చు. ఇలా మితంగా తాగడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. అధికంగా తాగితే మాత్రం బరువు త్వరగా పెరగడం, కాలేయం దెబ్బతినడం, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. మితంగా తాగితే శరీరంలోని టాక్సిన్లను బయటికి పంపించేస్తుంది. చర్మాన్ని శుద్ది చేసి మెరుపును అందిస్తుంది. గుండెకు కూడా మేలు చేస్తుంది. డయాబెటిస్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. బీర్ లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా లభిస్తాయి. అలాగే ప్రొటీన్, విటమిన్ బి కూడా దొరుకుతాయి. అందుకే బీర్ మంచిదని చెబుతున్నారు పరిశోధకులు.