సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు సితార ఘట్టమనేని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. చిన్నప్పుడే సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ స్టార్ కిడ్ ఎప్పటికప్పుడు తన క్యూట్ ఫొటోలు, డాన్స్ వీడియోలను షేర్ చేస్తుంటుంది. దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురుతో కలిసి పలు వీడియోలను రూపొందిస్తూ యూట్యూబ్ లో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా సితార స్టైలిష్ ఫొటోషూట్ లో పాల్గొంది. ఎల్లో కలర్ ఫ్రాక్ వేసుకొని ఆమె దిగిన ఫొటోల్లో ఎంతో క్యూట్ గా ఉంది. సితార షేర్ చేసిన ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహేష్ ఫ్యాన్స్ ను ఈ ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. సితార 'సర్కారు వారి పాట' సినిమాలో పెన్నీ సాంగ్ లో నటించింది. సినిమాలో కూడా ఈ పాటలో కనిపిస్తుందేమో చూడాలి!