చలికాలంలో చిలగడదుంపలు తినాల్సిందే



చలికాలంలో చిలగడదుంపలు తినడం చాలా అవసరం. దీనిలో ఎన్నో పోషకాలు ఉంటాయి.



ఈ దుంపలలో విటమిన్ ఎ, సి, బి, డి వంటివి అధికంగా ఉంటాయి. అలాగే మంచి కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.



ఈ దుంపలను చలికాలంలో తినడం వల్ల రోగినిరోధక శక్తి విపరీతంగా పెరుగుతుంది.



చిలగడ దుంపలు మధుమేహులకు ఎంతో మంచిది. వీటిలో ఉండే సమ్మేళనం రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది.



కంటి ఆరోగ్యానికి చిలగడదుంప తినడం అవసరం.



దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి అధిక బరువును దీని సాయంతో త్వరగా తగ్గవచ్చు.



ఈ దుంపలు తినడం వల్ల ఆకలి తక్కువగా వేస్తుంది. కాబట్టి ఇతర ఆహారాలు తినకుండా ఉంటారు.



చిలగడ దుంపలు తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.