జుట్టు, చర్మం, ఆరోగ్యానికి మేలు చేసే అద్భుతమైన గుణాలు కలిగింది చిలగడదుంప.



ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు
ఫ్రీ రాడికల్స్ నష్టం నుంచి చర్మాన్ని రక్షిస్తాయి.


పొట్టలో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకి దోహదపడుతుంది.



ఇందులోని బీటా కెరోటిన్ కంటి చూపు మెరుగ్గా ఉండేలా ప్రోత్సహిస్తుంది.



కొన్ని అధ్యయనాల ప్రకారం చిలగడదుంపలు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
జ్ఞాపకశక్తిని పెంచుతాయి.


ఒత్తిడి, ఆందోళనలో ఉన్నప్పుడు స్వీట్ తినాలనే కోరికని ఇవి తీరుస్తాయి. ఎందుకంటే ఇవి తియ్యని రుచిని కలిగి ఉంటాయి.



రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి.



స్వీట్ పొటాటో బరువు తగ్గించేందుకు సూపర్ ఫుడ్.



మెగ్నీషియం పుష్కలంగా ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి గుండెకి మేలు చేస్తుంది.



రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.