చెమట పట్టేందుకు చాలా కారణాలున్నాయి. జ్వరం, టెన్షన్, ఉక్కపోత వల్ల చెమట పడుతుంది.

అయితే, చెమట చాలా చికాకు కలిగిస్తుంది. శరీరం కంపు కొడుతుంది.

కానీ, చెమట పట్టడం మంచిదేనని వైద్యులు చెబుతున్నారు. ఇది అనేక రోగాల నుంచి రక్షిస్తుందట.

చెమట మన శరీరాన్ని ఓవర్ హీటింగ్ నుంచి కాపాడుతుంది. శరీరాన్ని చల్లబరుస్తుంది.

చెమట మన శరీరంలోని వ్యర్థాలను బయటకు గెంటేస్తుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

2016 అధ్యయనంలో ఎక్కువగా చెమటను చిందించేవారి గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టారు.

నిత్యం వ్యాయమం చేసేవారిలో పాదరసం, సీసం వంటి భారీ లోహాలు తక్కువ స్థాయిలో ఉన్నాయని తేలింది.

చెమట క్రిములు, బ్యాక్టీరియా నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. బరువు తగ్గడానికి కూడా చెమట సాయం చేస్తుంది.

చెమట రక్త ప్రసరణను పెంచడం ద్వారా ఆరోగ్యకరమైన చర్మానికి సహాయపడుతుంది.

చర్మ కణాలకు అవసరమైన పోషకాలు, ఆక్సిజన్‌తో పోషణ పొందేలా చెమట సహకరిస్తుంది.

Images Credit: Pexels