రాగిపాత్రలో నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరమని నిపుణులు చెబెతున్నారు.

ఈ నియమాలు పాటించకపోతే కాపర్ టాక్సిసిటికి గురికావల్సి రావచ్చు.

రోజంతా రాగి పాత్రలో నిల్వ చేసిన నీళ్లు తాగుతుంటే కాపర్ టాక్సిసిటికి గురి కావచ్చు.

ఈ టాక్సిసిటి ఎక్కువ మొత్తంలో ఉంటే లివర్, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి ప్రమాదకర పరిస్థితులు ఎదురు కావచ్చు.

నిమ్మకాయ, తేనె కలిపిన నీళ్లు రాగి గ్లాస్ తో తీసుకోవద్దు . నిమ్మలో ఉండే ఆసిడ్ తో రాగి చర్య జరుపుతుంది.

ఫలితంగా కడుపునొప్పి, గ్యాస్, వాంతులు కావచ్చు.

నీళ్లు నింపేందుకు ముందు ప్రతిసారీ తప్పకుండా బాగా కడగాల్సి ఉంటుంది.

రాగి పాత్రలను ప్రతి నెలకు ఒకసారి ఉప్పు, నిమ్మకాయ ఉపయోగించి పూర్తి స్థాయిలో శుభ్రం చేసుకోవడం అవసరం.

మరకలుగా ఉన్న రాగి పాత్ర వల్ల ఆరోగ్య ప్రయోజనాలు తగ్గుతాయని గుర్తుంచుకోవాలి. Representational Image : Pexels