ఉదయాన్నే మొదటి డ్రింక్ గా నిమ్మకాయ నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది.

జీర్ణరసాల ఉత్పత్తికి దోహదం చేసి జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.

కడుపు నిండుగా ఉన్న భావన కలిగి ఉదయాన్నే తీసుకునే క్యాలరీల సంఖ్య తగ్గుతుంది. ఫలితంగా బరువు తగ్గుతారు.

నిమ్మలో సిట్రిక్ ఆసిడ్ ఉంటుంది. ఇది కిడ్నీరాళ్లను నివారిస్తుంది.

నిమ్మలోని ఆసిడ్ గుణాలు నోటి ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

విటమిన్ సి ఉంటుంది కనుక నిమ్మరసం ఇమ్యూనిటి పెంపొందిస్తుంది.

నిమ్మలోని ఆల్కలైన్ లక్షణాలు శరీర పీహెచ్ ను సంతులన పరుస్తుంది.

నిమ్మలో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్ల వల్ల చర్మం నిగనిగలాడుతుంది.

అంతేకాదు నిమ్మ.. గాయాలు త్వరగా మానేందుకు కూడా ఉపకరిస్తుంది.
Representational Image : Pexels