అబ్బాయిలు, మీలో ఎంత మంది స్నానం చేసేప్పుడు అంగం క్లీన్ చేసుకుంటారు?

అబ్బే, అలాంటి అలవాటు లేదు. అయినా క్లీన్ చేసుకోవల్సిన అవసరం ఏముంది అనేగా మీ ప్రశ్న.

అయితే, మీరు తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాలి.

స్నానం చేసేప్పుడు మీరు తప్పకుండా అంగం స్కిన్‌(శిశ్నం చర్మం)ను వెనక్కి తీసి క్లీన్ చేసుకోవాలి.

ఒక వేళ మీ అంగం చివరి చర్మం టైటుగా ఉండి.. వెనక్కి వెళ్లకపోతే డాక్టర్‌ను కలవండి.

అంగం పైచర్మం.. ఒక హెల్మెట్‌లా దాని సున్నితమైన భాగాన్ని కాపాడుతుంది.

దాన్ని క్లీన్ చేయకపోతే.. మీగడ తరహాలో తెల్లటి పొర (స్మెగ్మా లేదా శిశ్నమలము) ఏర్పడుతుంది.

అది.. క్లీన్ చేయకపోతే బ్యాక్టీరియా తిష్ట వేస్తుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఏర్పడతాయి.

కాబట్టి, స్నానం చేసేప్పుడు గోరువెచ్చని నీటితో ఆ భాగాన్ని క్లీన్ చేయండి.

Images Credit: Pexels