ఆహారానికి చక్కటి అరోమా ఇచ్చే కరివేపాకు జుట్టు తెల్లబడకుండా కాపాడుతుంది.

ఇడ్లీ, దోశ, ఢోక్లా, బ్రెట్ వంటి ఫర్మెంటెడ్ ఆహారాలు కూడా జుట్టును నల్లగా నిగనిగ లాడేలా చేస్తాయి.

డార్క్ చాక్లెట్ చాలా రకాల అనారోగ్య లక్షణాలను అరికడుతుంది.

ప్రొటీన్, కాల్షియం ఎక్కువగా ఉండే పాల ఉత్పత్తులు కూడా జుట్టు ఆరోగ్యానికి మంచిది.

సోయా బీన్స్ లో కూడా చాలా ప్రొటీన్ ఉంటుంది. కనుక దీన్ని వెజిటేరియన్స్ మీట్ గా చెప్పుకోవచ్చు.

పుట్టగొడుగుల్లో కూడా చాలా ప్రొటీన్ ఉంటుంది. ఇది కూడా జుట్టు ఆరోగ్యంగా నల్లగా పెరిగేందుకు దోహదం చేస్తుంది.

పప్పు ధ్యానాల్లో ప్రొటీన్ తోపాటు ఐరన్, జింక్, ఫోలేట్ వంటి పోషకాలు అందుతాయి.

రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే పదార్థాలను భోజనంలో చేర్చుకోవడం అవసరం.

ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా లభించే చేపలు తప్పకుండా తీసుకోవాలి.

గుడ్డులో చాలా ప్రొటీన్ ఉండడంతో పాటు గుడ్డు తింటే కడుపు నిండిన భావన కూడా కలుగుతుంది. Representational Image : Pexels