విజయం సాధించడానికి కలలు కనే బదులు వాటినే లైఫ్‌గా చేసుకోండి. నిద్రపోతున్నా, మేల్కొన్నా, కూర్చున్నా, మీ మనస్సు, మెదడ, శరీరంలోని ప్రతి భాగం అదే ఆలోచనతో ఉండాలి. ఇదే విజయానికి మంచి మార్గం.
లేవండి.. మేల్కొండి. లక్ష్యాన్ని సాధంచే వరకు ఆగకండి
మిమ్మల్ని మీరు బలహీనులుగా భావించడం చాలా పెద్ద పాపం. ఇది మనలోని ప్రేరణకు అడ్డంకిగా మారుతుంది.
మెదడు, మనస్సు మధ్య సంఘర్షణ ఏర్పడినప్పుడు ఎప్పుడూ మెదడు చెప్పే మాటనే వినాలి
ఒక సమయంలో ఒకే పని చేయండి. వంద శాతం ఎఫర్ట్ పెట్టి ఆ పని చేయండి
నచ్చినట్టు ఉండండి. స్వభావానికి అనుగుణంగా ఉండటమే గొప్ప ధర్మం. మిమ్మల్ని మీరు నమ్మండి
మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. ఇలా మోసం చేసుకునే వాళ్లు జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేరు.
మన ఆలోచనలే మన బలం. మిమ్మల్ని మీరు బలహీనంగా భావిస్తే బలహీనులు అవుతారు. బలంగా భావిస్తే శక్తిమంతులు అవుతారు.
లైఫ్‌లో వచ్చే సవాళ్లే మీరు సరైన వారని చెప్పదానికి నిదర్శనం. కష్టాలు రావడం లేదంటే మనం తప్పుదారిలో వెళ్తున్నామని అంగీకరించాలి
నిజం చెప్పడానికి మార్గాలు ఎన్నైనా ఉండొచ్చు కానీ నిజం మాత్రం అలాగే ఉంటుంది.
ప్రతి సంవత్సరం జనవరి 12న స్వామి వివేకానంద జయంతిని యువజన దినోత్సవంగా జరుపుకుంటాం.