చంద్రుడిపై తొలిసారి ప్రయోగం చేసిన సోవియట్ తొలిసారి మనుషులను పంపించిన నాసా మూన్ మినరాలజీ మ్యాప్ తయారు చేసిన ఇస్రో భూమికి సుమారుగా 3లక్షల 84వేల కిలోమీటర్ల దూరంలో చంద్రుడు చంద్రుడి మీద ప్రయోగాలు 1959లో మొదలెట్టింది సోవియట్ యూనియన్ తొలిసారిగా మనుషులు లేకుండా లూనా 2 అనే స్పేస్ క్రాఫ్ట్ పంపించింది. అమెరికా అపోలో ప్రోగ్రామ్‌ను స్టార్ట్ చేసి నీల్ ఆర్మ్ స్ట్రాంగ్‌ను చంద్రుడిపైకి పంపించింది. 1969-72 మధ్య కాలంలో ఏకంగా 12 మంది నాసా ఆస్ట్రోనాట్స్ చంద్రుడిపైకి వెళ్లి వచ్చారు. 2003 ఆగస్టు 15 వేడుకల్లో తొలిసారిగా ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయ్ చంద్రయాన్ ప్రయోగంపై ప్రకటన చేశారు. 2008లో చంద్రయాన్ 1 ను ప్రయోగించిన ఇస్రో మూన్ మినరాలజీ మ్యాప్ తయారు చేసింది. 2019లో చంద్రయాన్ 2 ను ప్రయోగించి విఫలమైంది. ఓ ల్యాండర్‌ను, అందులో నుంచి ఓ బుల్లి రోవర్‌ను చంద్రుడి దక్షిణ ధృవంపై దింపాలని ప్లాన్ చేసింది