ప్రపంచంలోని ఏడు వింతల్లో తాజ్ మహల్ కూడా ఒకటి. దేశ రాజధాని ఢిల్లీకి దగ్గరలోని ఆగ్రాలో తాజ్‌మహల్ ఉంది. ఢిల్లీలోని కుతుబ్‌మినార్ కంటే తాజ్‌మహల్ ఎత్తు అయినది. తాజ్‌మహల్‌ని కట్టినప్పుడు దాని విలువ రూ.32 లక్షలు. ఇప్పుడు దాదాపు రూ.82 వేల కోట్లు. దీని నిర్మాణంలో ముత్యాలు, వజ్రాలు వంటి 40 విలువైన రాళ్లను ఉపయోగించారు. తాజ్‌మహల్‌ను కట్టడానికి దాదాపు 1,000కి పైగా ఏనుగులు కష్టపడ్డాయి. మొగలు చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ గుర్తుగా తాజ్‌మహల్‌ను నిర్మించాడు. తాజ్‌మహల్ నిర్మాణానికి 20 సంవత్సరాలు పట్టింది. దాదాపు 20 వేల మందికి పైగా పని చేశారు. తాజ్ నిర్మాణంలో ఉపయోగించిన వస్తువులను పంజాబ్, రాజస్త, శ్రీలంక, టిబెట్, చైనాల నుంచి తెప్పించారు.