శిథిలాల కింద చిక్కుకున్న ఓ చిన్నారి తన తమ్ముడిని కాపాడాలని చూస్తున్న ఈ ఫోటో అందరి మనసుల్ని కలిచివేస్తోంది. తమ వారు ఎక్కడున్నారో తెలియక, అసలున్నారో లేరో అర్థం కాక ఇలా రోదిస్తున్నారు బాధితులు. శిథిలాల కింద నలిగిపోయిన వాళ్లను కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద ఎంతో మంది చిన్నారులు చిక్కుకున్నారు. వాళ్లను బయటకు తీసేందుకు ఎన్నో అవస్థలు పడుతున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న ఓ నవజాత శిశువుని కాపాడి ఆసుపత్రికి తరలించారు. ఈ ఫోటో గుండెని కలిచివేస్తోంది. పిల్లలు ఎక్కడున్నారో అని తల్లిదండ్రులు వెతుక్కోవడం భావోద్వేగానికి గురి చేస్తోంది. దేవుడా మాకేంటీ కష్టం అంటూ ఇలా గుండెలు పగిలేలా రోదిస్తున్నారు బాధితులు. భూకంపం ధాటికి గాయపడిన జంతువులనూ చేరదీసి చికిత్స అందిస్తున్నారు. టర్కీ సిరియాలో ఎక్కడ చూసినా ఇలా శవాలే కనిపిస్తున్నాయి. (Images Credits:AFP)