కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ 2023 ప్రసంగంలో కీలక ప్రకటనలు చేశారు.

బడ్జెట్‌లో సాగు రంగానికి ప్రాధాన్యతనిచ్చింది కేంద్రం. వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ. 20 లక్షల కోట్లకు పెంచింది.

రైల్వే రంగానికి భారీ కేటాయింపులు దక్కాయి. రూ.2.40 లక్షల కోట్లు కేటాయించింది మోడీ సర్కార్.

దేశవ్యాప్తంగా కొత్తగా 50 విమానాశ్రయాలు ఏర్పాటు చేయనున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

ఆరోగ్య రంగంపైనా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. 157 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది.

రక్షణ బడ్జెట్‌ను సుమారు 70 వేల కోట్ల రూపాయల మేర పెంచింది. రూ.5.94 లక్షల కోట్లు కేటాయించింది.

బడ్జెట్‌లో విద్యా రంగానికి పెద్ద పీట వేశారు. దేశవ్యాప్తంగా 30 స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు.

విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 'నేషనల్ డిజిటల్ లైబ్రరీలు(NDL)' ఏర్పాటు చేయనుంది కేంద్రం. (Images Credits:Pixabay)