చంద్రయాన్ 3 కోసం రూ. 615 కోట్లు ఖర్చు చంద్రుడి మీద ప్రయోగాలకు పనికి వస్తున్న స్లింగ్ షాట్ టెక్నాలజీ పొలాల్లో పిట్టలు వాలితే తోలడానికి వాడేదే స్లింగ్ షాట్ టెక్నాలజీ దీన్ని తెలుగులో వడిశెలు అంటారు అందులో చిన్న రాయి పెట్టి చేత్తో గిరగిరా తిప్పి విసురుతారు ఈ రాకెట్ భూమి చుట్టూ తిప్పి భూమి కక్ష్య నుంచి ఒక్కసారిగా చంద్రుడి కక్ష్యలోకి అమాంతం వెళ్లనుంది. చంద్రుడు కక్ష్య చుట్టూ ఇలానే తిరుగుతూ చంద్రుడి ఉపరితలానికి దగ్గరగా వెళ్లటం. ఇలా చేయటం ద్వారా చాలా ఇంధనం ఆదా అవుతుంది. చంద్రుడి మీద ల్యాండర్ దిగటానికి వచ్చే నెల 24, 25 వరకూ వేచి చూడాలి.