దానిమ్మ తొక్కల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

ఈ తొక్కలను వినియోగిస్తే ఆరోగ్యం, అందం సొంతం చేసుకోవచ్చు.

దానిమ్మ తొక్కలను చాలా రకాలుగా వినియోగించవచ్చు. ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం.

దానిమ్మ తొక్కలతో టీ కాచుకుని తాగొచ్చు, లేదా దానిమ్మ తొక్కలను స్మూతీల్లో కూడా వినియోగించవచ్చు.

దానిమ్మ తొక్కల్లో పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీరాడికల్స్ ను సంతులన పరుస్తాయి.

దానిమ్మ తొక్కల్లో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.

దానిమ్మ తొక్కల్లో ఉండే సహజసమ్మేళనాల్లో యాంటిమైక్రోబియల్ లక్షణాల వల్ల నోటి లోని బ్యాక్టీరియాను తొలగిస్తుంది.

దానిమ్మ తొక్కల్లో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది.

కడుపు నిండుగా ఉన్న భావన కలిగించి క్యాలరీల వినియోగాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images courtesy : Pexels