రుచికరమైన కూరగాయల్లో వంకాయ ఒకటి. ఎలా వండిన రుచి అమోఘం. అలాంటి వంకాయలో పోషకాలు కూడా పుష్కలం. వంకాయలో విటమిన్లు సి, కె, బి6, థయామిన్, నియాసిన్ విటమిన్లు ఉంటాయి. మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాపర్, ఫోలేట్ వంటి ఖనిజలవణాలు కూడా ఉంటాయి. వంకాయలో క్యాలరీలు కూడా చాలా తక్కువ. ఫైబర్ ఎక్కువ. బరువు తగ్గాలనుకునే వారికి మంచి చాయిస్. వంకాయలో ఉండే పోషకాలు గుండె ఆరోగ్యానికి మంచిది. బీపి అదుపులో ఉంచి కొలెస్ట్రాల్ ను నిరోధిస్తుంది. క్లోరొజెనిక్ ఆసిడ్, నాసునిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు కూడా వంకాయలో ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్ డ్యామెజితో పోరాడుతాయి. Representational Image : Pexels