ఈ బిజీ లైఫ్‌లో పురుషులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. పురుషులకు ప్రతి నిత్యం అవసరమయ్యే కొన్ని పోషకాల గురించి తెలుసుకుందాం. శరీరం సరిగ్గా పనిచేసేందుకు విటమిన్ బి కాంప్లెక్స్ చాలా అవసరం. బి1 నుంచి బి12 వరకు అన్నీ పవర్ హౌజ్ విటమిన్లే. ఇవి ఆహారాన్ని శక్తిగా మార్చడం, నాడీ వ్యవస్థ పనితీరును నిర్వహించడ వరకు అన్నీటికి అవసరమే. విటమిన్లు సి, డి: నిరోధక వ్యవస్థ బలంగా ఉండేందుకు సి విటమిన్, విటమిన్ డి ఎముకల బలానికి అవసరం. విటమిన్ సి సిట్రస్ పండ్ల నుంచి, విటమిన్ డి సూర్యరశ్మి, చేపలు, గుడ్డు నుంచి లభిస్తుంది. మెదడు పనితీరుకు అవసరమయ్యే బూస్టర్ ఒమెగా3 ఫ్యాటీ ఆసిడ్స్. గుండె ఆరోగ్యానికీ అవసరమే. చేపలు, వాల్ నట్స్, షియాసీడ్స్, అవిసెగింజల్లో ఒమెగా3 ఫ్యాటీ ఆసిడ్లు పుష్కలం. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి ప్రొబయోటిక్స్ చాలా అవసరం. పెరుగు, పులియబెట్టిన కొన్ని పదార్థాల ద్వారా ఇవి శరీరానికి అందుతాయి . Representational Image : Pexels