పాలు ప్రపంచవ్యాప్తంగా పోషకాహారంగా పరిగణించబడతాయి. ప్రొటీన్, కాల్షియం, విటమిన్ డి, విటమిన్ బి12 వంటి పోషకాలు కలిగి ఉంటాయి. ఎముకలు, కండరాల బలానికి పాలు దోహదం చేస్తాయి. సాధారణంగా గేదెపాలు, ఆవుపాలు రెండూ అందుబాటులో ఉంటాయి. గేదేపాలతో పోలిస్తే ఆవు పాలు మరింత పోషక విలువలు కలిగి ఉంటాయని భావిస్తారు. గేదె పాలతో పోలిస్తే ఆవుపాలలో కొవ్వు తక్కువ. ఆవు పాలలో ప్రొటీన్, కొవ్వు , కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఆవుపాలలో కొలెస్ట్రాల్ తక్కువ. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు ఆవుపాలు తీసుకోవడం మంచిది. ఆవు పాలు గేదె పాలకంటే తక్కువ అలెర్జిక్. లాక్టోజ్ ఇన్టాలరెన్స్ తో బాధపడే వారికి ఆవు పాలు కాస్త మెరుగైనవి. గేదే పాలతో పోలిస్తే ఆవు పాలలో క్యాలరీలు కూడా తక్కువే. Representational Images : Pexels