రాత్రి భోజనం ఆలస్యంగా చెయ్యడం డయాబెటిస్, గుండె జబ్బులకు కారణమవుతోందని నిపుణులు హెచ్చిరిస్తున్నారు. మెరుగైన నిద్ర, రాత్రి భోజనం త్వరగా పూర్తి చెయ్యడం వల్ల చాలా రోగాలు అదుపులో ఉంటాయట. రాత్రి ఆలస్యంగా భోంచెయ్యడం వల్ల శరీరంలోని సహజ జీవక్రియా విధానాలు దెబ్బతింటాయి. ఇది స్థూలకాయనికి మొదటి కారణం. అర్థరాత్రి భోజనాల వల్ల గ్యాస్ట్రోఈసోఫాగియల్ రిఫ్లక్స్ ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి సూర్యాస్తమయానికి ముందు రాత్రి భోజనం పూర్తి చెయ్యడం ఉత్తమం. కనీసం 8 గంటల లోపు ముగించాలని నిపుణులు సూచిస్తున్నారు. 7 గంటలకు డిన్నర్ పూర్తి చేస్తే చాలా మంచిదట. నిద్ర సమయానికి ముందే తిన్న ఆహారం మొత్తం జీర్ణం కావడం వల్ల నిద్ర నాణ్యత పెరుగుతుందట. సాయంత్ర సమయంలో శరీరంలో ఎక్కువ స్టిరాయడ్ హార్మోన్లు, గ్రోత్ హార్మోన్లు, ఇన్సులిన్ వంటి లిపోజెనిక్స్ ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతాయి. అందువల్ల సాయంత్రం తీసకునే ఆహారం ద్వారా ఎక్కువ కొవ్వులు ఉత్పత్తి అవుతాయి. ప్రతి రోజూ ఒకే సమయానికి భోంచెయ్యడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి పోషకాల శోషణ, జీవక్రియలు స్థిరీకరించబడుతాయి. Representational Image : Pexels