పొద్దున్నే ఇవి తింటున్నారా? ఆరోగ్యం జాగ్రత్త! కమర్షియల్ ప్రొటీన్ బార్లలో అదనపు చక్కెరలు, కొవ్వులు ఉంటాయి. ఎక్కువ షుగర్ కలిగిన ఆర్టిఫిషియల్ ఫ్లేవర్లు కలిపిన యోగర్ట్ తీసుకోవద్దు. మార్కెట్లో దొరికే రెడీమెడ్ స్మూదీల్లో షుగర్ ఎక్కువగా ఉంటుంది. కృత్రిమ పదార్థాలు కూడా ఉంటాయి. ప్రాసెస్ చేసిన పండ్ల రసాల్లో అదనపు చక్కెరలు, కృత్రిమ ఫ్లేవర్లు ఉంటాయి. ఫైబర్ ఉండదు. ఇవి తీసుకోవద్దు. సిరప్ లో నానిన ప్యాన్ కేక్స్ లో అదనపు చక్కెరలు, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. వీటి వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. సంతృప్తకొవ్వులు, సోడియం, నైట్రేట్లు గుండె జబ్బులకు కారణం అవుతాయి. ఇవి కలిగిన బేకన్స్ సాసేజ్ లు తీసుకోవద్దు. శుద్ధి చేసిన చక్కెరలు, తక్కువ పోషక విలువలు కలిగిన పేస్ట్రీలు, డోనట్లు తినొద్దు. అదనపు చక్కెరలు కలిగిన సీరియల్స్ తీసుకుంటే పోషకాలు లేని క్యాలరీలు శరీరంలో చేరుతాయి. Representational Image : Pexels