అదేంటి తెల్ల జుట్టు చూడటానికి బాగోదు కదా దాని వల్ల లాభాలు ఏముంటాయ్ అనుకుంటున్నారా?
కానీ ఉన్నాయ్ అవి ఏంటో తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు.


తెల్ల జుట్టు వృద్ధాప్యానికి సంకేతం అంటారు. కానీ కొంతమందికి చిన్న వయసులోనే జుట్టు తెల్లబడిపోతుంది.



జుట్టుకి రంగు వేయడం వల్ల అందులోని రసాయనాలు జుట్టు రంగుని మారుస్తాయి.
దాని వల్ల జుట్టు బలహీనపడుతుంది. అదే రంగు వేసుకోకపోతే ఆరోగ్యకరమైన జుట్టు మీ సొంతం.


రంగు వేసుకోవడం వల్ల స్కాల్ఫ్ చికాకు పెడుతుంది. అదే వేసుకోకపోతే మీకు అలర్జీ సమస్యే ఉండదు.



జుట్టుకు రంగు వేసుకోకపోతే బోలెడు డబ్బు ఆదా అయినట్టే



మీ టైమ్ కూడా ఆదా అవుతుంది. జుట్టుకి రంగు వేసుకోవడానికి ఎక్కువగా సమయం పడుతుంది.
అదే తెల్ల జుట్టు ఉంచుకుంటే ఆ టైమ్ సేవ్ అయినట్టే కదా.


తెల్ల జుట్టు మెరుస్తూ చాలా అందంగా కనిపిస్తుంది కూడా. అది వయసు మళ్లిన వారికి మరింత అందాన్ని
ఆపాదిస్తుంది


హెయిర్ డై లోని టాక్సిన్స్ స్కాల్ఫ్ మాత్రమే కాదు పర్యావరణానికి హాని చేస్తాయి.
అందుకే వాటిని వినియోగించకపోవడమే ఉత్తమం.


కొంతమంది కావాలని జుట్టుకి తెలుపు రంగు వేయించుకుంటారు.



లైట్ గ్రే కలర్ వేసుకోవడం వల్ల జుట్టు ప్రకాశవంతంగా మెరిసిపోతుంది.



తెల్ల జుట్టు అనేది వయసు, అనుభవం, జ్ఞానం ఇస్తుంది. వైట్ హెయిర్ వచ్చినంత మాత్రం
ముసలితనం వచ్చేసిందని అర్థం కాదు. అదొక గొప్ప ఫీలింగ్ అంటున్నారు కొందరు.