అన్ని జ్ఞానేంద్రియాల్లోకి కళ్లు చాలా ప్రధానమైనవి. ఈ డిజిటల్ యుగంలో కళ్లు రకరకాల కాంతికాలుష్యాల బారిన పడుతున్నాయి. క్యారెట్ లో కంటి ఆరోగ్యానికి అవసరమయ్యే బీటా కెరాటిన్, విటమిన్ ఏ ఉంటాయి. కంటి ఇన్ఫెక్షన్లు రాకుండా నివారిస్తాయి. బాదం, పిస్తా, వాల్ నట్ వంటి డ్రైఫ్రూట్స్ లో ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్లు, విటమిన్ ఇ ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. బచ్చలి కూరతో పాటు ఇతర ఆకుపచ్చని కూరల్లో కంటి ఆరోగ్యానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కంటికి హాని కలిగించే బ్లూలైట్ నుంచి కాపాడడం లో ఆకుకూరల్లో ఉన్న లూటిన్ ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. విటమిన్ సి పుష్కలంగా ఉండే ఉసిరి కంటి కండరాలను బలోపేతం చేస్తుంది. కంటి శుక్లాలను నివారిస్తుంది. చిలగడదుంపల్లో బీటా కెరాటిన్ చాలా ఎక్కువ. కనుక చిలగడదుంపలు కూడా కంటి శుక్లాలు రాకుండా నివారిస్తాయి. Representational Image : Pexels