ఆరోగ్యంగా ఉండేందుకు, అన్ని జీవక్రియలు సక్రమంగా జరిగేందుకు తప్పనిసరిగా విటమిన్లు అవసరమవుతాయి. రకరకాల విటమిన్ల గురించి మీకు తెలిసే ఉంటుంది. కానీ విటమిన్ పి గురించి ఎప్పుడైనా విన్నారా? మొక్కల నుంచి లభించే కొన్ని పోషకాలను విటమిన్ పి అని చెప్పేవారు. పండ్లు, కూరగాయాలు, రెడ్ వైన్, కోకొవా, టీలలో రకరకాల ఫ్లవెనాయిడ్స్ ఉంటాయి. డయాబెటిస్, గుండెజబ్బులు, ఇతర చాలా రకాల అనారోగ్యాలను ఈ ఫ్లవెనాయిడ్స్ నివారిస్తాయి. తర్వాత కాలంలో వీటినే ఫ్లేవనాయిడ్స్ గా గుర్తించారు. దాదాపుగా 6 వేల రకాల ప్లెవనాయిడ్స్ ఉన్నాయి. తర్వాత కాలంలో వీటినే ఫ్లేవాయిడ్లుగా గుర్తించారు. తర్వాత విటమిన్ పి అనే మాట ఉపయోగించడం మానేశారు. 1930లో శాస్త్రవేత్తలు కొత్తరకం విటమిన్లను కనుగొన్నారు. వాటికి విటమిన్ P అని పేరుపెట్టారు. బెర్రీలు, టమాటలు, చెర్రీల్లో ఉండే ఆకర్శణీయమైన రంగు ఫ్లేవనాయిడ్ల వల్ల మాత్రమే. ఫ్లవనాల్స్, ఫ్లేవోన్స్, ఫ్లవెనాల్స్, ఫ్లవనాన్స్, ఐసోఫ్లెవోన్స్, ఆంథోసయానిడిన్స్ అని ముఖ్యమైన తరగతులుగా ఉంటాయి. ఆంథోసయనిడిన్స్, ఫ్లవనాన్స్ వంటి కొన్ని రకాల ఫ్లవెనాయిడ్స్ గుండె జబ్బులను నివారించడంలో తోడ్పడుతాయి. Representational Image : Pexels