సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘లాల్ సలామ్’ శుక్రవారం థియేటర్లలో విడుదల అయింది.

ఈ సినిమాలో రజనీకాంత్ కీలక పాత్రలో నటించారు.

రజనీకాంత్ ప్రస్తుతం కెరీర్‌లోనే పీక్ ఫాంలో ఉన్నారు.

2023లో విడుదల అయిన ‘జైలర్’ రూ.600 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

2023లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ సినిమా ‘జైలర్’నే.

‘జైలర్’కు ముందు నటించిన ‘దర్బార్’, ‘అన్నాత్తే’ సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి.

‘జైలర్’కు ముందు కొన్ని సినిమాల ముందు వరకు రజనీకి హిట్ లేదు.

కానీ ‘జైలర్’ రజనీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న బ్లాక్‌బస్టర్‌ను అందించింది.

రజనీ కాంత్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ‘2.0’ నిలిచింది.

ఈ సినిమా ఏకంగా రూ.800 కోట్ల వరకు వసూళ్లు సాధించింది.