న్యూఢిల్లీలోని ప్రగతి మైదానంలో రెండు రోజుల పాటు జీ20 సదస్సు జరగనుంది.
ప్రపంచ దేశాల అధినేతలతో పాటు కీలక నేతలు హాజరు కానున్నారు.


ఈ సదస్సుకి వచ్చే అతిధులకి వడ్డించే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
వారికి అందించే మెనూ ప్రత్యేకతలు ఏంటంటే..!


ది హిందూ నివేదిక ప్రకారం తాజ్ ప్యాలెస్ లోనిన్ 120 మంది చెఫ్ ల బృందం ప్రతినిధుల కోసం
500 రకాల వంటకాలు సిద్ధం చేస్తోంది.


వివిధ ప్రాంతాలకి చెందిన ఫేమస్ వంటకాలు వడ్డించనున్నారు.
ప్రత్యేకంగా ఎంపిక చేసిన 60 మంది చెఫ్ లు 170 వంటకాలు అందిస్తారు.


మెనూలో గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర నుంచి తాలీలు ఉంటాయి.
ఒక్కో ప్లేట్ లో 12 రకాల వంటకాలు ఉంటాయి.


దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఫేమస్ అయిన స్ట్రీట్ ఫుడ్స్ అందిస్తారు.
ఢిల్లీ నుంచి ఛాట్, మహారాష్ట్ర నుంచి పావ్ భాజీ, తమిళనాడు నుంచి పనియారం ఉంటాయి.


ఈ ఏడాది మిల్లెట్ ఆఫ్ ది ఇయర్ గా ప్రకటించిన విషయం తెలిసిందే.
అందుకే మిల్లెట్ తో చేసిన వంటలకి అధిక ప్రాధాన్యత ఇచ్చారు.


డెజర్ట్ మెనూ లో బజ్రే ఖీర్, రాగి బాదం , బెల్లం ఉసిరి లడ్డూ వంటి మిల్లెట్ ఆధారిత పదార్థాలు అందిస్తారు.



రాగి, జోవర్, ఫింగర్ మిల్లెట్ తో తయారు చేసిన చాక్లెట్ బార్స్ కూడా ఉంటాయి.
వీటిలో చక్కెర, పిండి వంటివి ఏమి లేకుండా ప్రత్యేకంగా చేస్తారు.


Images Credit: Pexels/ Pixabay/ Twitter