అవకాడోలో విటమిన్ E ఉంటుంది. ఇది చర్మానికి రక్షణ ఇస్తుంది. కొవ్వు చేపల్లో ఆమ్లాలు ఉంటాయి. చర్మాన్ని పొడిబారకుండా రక్షిస్తుంది. నట్స్ లో ఒమేగా 3 ఉంటుంది. చర్మంపై తేమను లాక్ చేస్తుంది. స్వీట్ పొటాటోలో బీటా కెరోటిన్, విటమిన్ A చర్మ కణాలను యాక్టీవ్‌గా ఉంచుతాయి. దోసకాయలో అధిక నీటి కంటెంట్ ఉంటుంది. చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. కొబ్బరినూనెను డైట్లో చేర్చుకుంటే చర్మానికి లోపలి నుంచి పోషణ అందిస్తుంది. ఆమ్ల ఫలాలలో విటమిన్ C ఉంటుంది. ఇవి కొల్లాజెన్ ను ఉత్పత్తి చేస్తాయి. పొడిచర్మంతో పోరాడుతాయి.