ఉల్లి ఆకును కొన్ని ప్రాంతాల్లో ఉల్లి పొరక అని కూడా వ్యవహరిస్తారు. రుచి మాత్రమే కాదు వంటకాలకు పోషకాలను కూడా జోడిస్తుంది.

ఉల్లి ఆకులో విటమిన్ A, C, K వంటి ఆవశ్యక పోషకాలెన్నో ఉంటాయి.

పోటాషియం, ఫోలేట్ వంటి ఖనిజ లవణాలు కూడా ఉల్లి ఆకులో పుష్కలం.

క్వెర్సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉండడం వల్ల శరీరంలో ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇన్ఫ్లమేషన్ ను నివారిస్తుంది.

ఉల్లిఆకులోని ఇతర సమ్మేళనాలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. బీపిని అదుపులో ఉంచి, కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తాయి.

విటమిన్ సి ఉండడం వల్ల నిరోధకవ్యవస్థ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. ఫలితంగా చిన్నచిన్న ఇన్ఫెక్షన్లను నివారించబడుతాయి.

ఉల్లి ఆకులో ఉండే ఫైబర్ వల్ల మలబద్దకం, అజీర్తి వంటి సమస్యలు నివారించబడి జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటంది.

ఉల్లి ఆకులో ఉండే ఆలిసిన్.. శరీరంలో ఇన్ఫ్లమేషన్ నివారించి ఆర్థరైటిస్ వంటి సమస్యల్లో నొప్పిని తగ్గిస్తాయి.

ఉల్లి కాడల్లో ఉండే కొన్ని సమ్మేళనాలు ఇన్సులిన్ సెన్సిటివిటిని పెంచుతాయి. డయాబెటిక్స్‌కు ఇది చాలా మేలైన ఆహారం.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images courtesy : Pexels