గెలవక తప్పని మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను ఆర్సీబీ చిత్తు చేసింది. ఉప్పల్‌లో స్టేడియంలో విరాట్ కోహ్లీ వీర శతకం సాధించి బెంగళూరును గెలిపించాడు. మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. అనంతరం ఆర్సీబీ 19.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున కింగ్ కోహ్లీ (100) సెంచరీతో చెలరేగాడు. కెప్టెన్ ఫాఫ్ డుఫ్లెసిస్ (71) కూడా అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. సన్‌రైజర్స్ తరఫున హెన్రిచ్ క్లాసెన్ (104) శతకంతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. దీంతో పాయింట్ల పట్టికలో బెంగళూరు నాలుగో స్థానానికి చేరుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు విరాట్ కోహ్లీకి వరించింది.