రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బౌలింగ్, బ్యాటింగ్ లో రాణించింది. ఈ మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 17.5 ఓవర్లకు 118 పరుగులకే ఆలౌటైంది. ఈ టార్గెట్ ను గుజరాత్ ఆటగాళ్లు 13.5 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ కోల్పోయి ఛేదించారు. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (36), సాహా (41) రాణించారు. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా (39 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో గుజరాత్ విజయతీరాలకు చేరుకుంది. ఈ విజయంతో 14 పాయింట్లతో గుజరాత్ టేబుల్ టాపర్‌గా నిలిచింది. గుజరాత్‌ను ఓడించి టేబుల్ టాపర్‌గా నిలవాలనుకున్న సంజూ సేన ఆశలకు గండి పడింది.