కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై 49 పరుగులతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 235 పరుగులు చేసింది. కోల్‌కతా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 186 పరుగులకే పరిమితం అయింది. కోల్‌కతా బ్యాటర్లలో జేసన్ రాయ్ (61: 26 బంతుల్లో) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రింకూ సింగ్ (53 నాటౌట్: 33 బంతుల్లో) అర్థ సెంచరీ సాధించాడు. కానీ వారికి మిగతా టీమ్ నుంచి సహకారం లభించలేదు. దీంతో నైట్‌రైడర్స్‌కు ఓటమి తప్పలేదు. చెన్నై బ్యాటర్లలో రహానే (71 నాటౌట్: 29 బంతుల్లో) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రహానే 245 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేయడం విశేషం. శివం దూబే (50: 21 బంతుల్లో), డెవాన్ కాన్వే (56: 40 బంతుల్లో) అర్థ సెంచరీలు సాధించారు.