ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 189 పరుగులు చేసింది. అనంతరం రాజస్తాన్ 20 ఓవర్లలో 182 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్లలో దేవ్‌దత్ పడిక్కల్ (52: 34 బంతుల్లో) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. యశస్వి జైస్వాల్ (47: 37 బంతుల్లో) చక్కటి సహకారం అందించాడు. ఆఖర్లో ధ్రువ్ జురెల్ (34 నాటౌట్: 16 బంతుల్లో) పోరాడినా ఫలితం లేకపోయింది. బెంగళూరు బ్యాట్స్‌మెన్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ (77: 44 బంతుల్లో) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఫాఫ్ డుఫ్లెసిస్ (62: 39 బంతుల్లో) అర్థ సెంచరీ సాధించాడు. ముఖ్యంగా చివరి ఐదు ఓవర్లలో బెంగళూరు బ్యాటర్లు చెత్త ప్రదర్శన కనబరిచారు. కేవలం 33 పరుగులు మాత్రమే చేసి ఐదు వికెట్లు కోల్పోయారు.