ఐపీఎల్ 2023 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతా తెరిచింది. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ నాలుగు వికెట్లతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్ అయిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ 19.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఢిల్లీ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ (57: 41 బంతుల్లో) స్కోరర్‌గా నిలిచాడు. అక్షర్ పటేల్ (19: 22 బంతుల్లో) చివరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్‌ను గెలిపించాడు. కోల్‌కతా బ్యాటర్లలో జేసన్ రాయ్ (43: 39 బంతుల్లో) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆండ్రీ రసెల్ (38 నాటౌట్: 31 బంతుల్లో) చివరి వరకు పోరాడాడు.