రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై చెన్నై సూపర్ కింగ్స్ ఎనిమిది పరుగులతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోరు చేసింది. బెంగళూరు 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 218 పరుగులకు పరిమితం అయింది. బెంగళూరు బ్యాటర్లలో గ్లెన్ మ్యాక్స్‌వెల్ (76: 36 బంతుల్లో) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఫాఫ్ డుఫ్లెసిస్ (62: 33 బంతుల్లో) అర్థ సెంచరీతో రాణించాడు. అయినా వీరు బెంగళూరును గెలిపించలేకపోయారు. చెన్నై బ్యాటర్లలో డెవాన్ కాన్వే (83: 45 బంతుల్లో) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శివం దూబే (52: 27 బంతుల్లో) అర్థ సెంచరీ సాధించాడు. చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే మూడు వికెట్లు పడగొట్టాడు. డెవాన్ కాన్వేకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.