ఐపీఎల్‌ 2023లో ముంబయి ఇండియన్స్‌ వరుసగా రెండో విజయం అందుకుంది.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నిర్దేశించిన 186 పరుగుల టార్గెట్‌ను అత్యంత సునాయాసంగా ఛేదించేసింది.

17.4 ఓవర్లకే 5 వికెట్ల తేడాతో విజయ ఢంకా మోగించింది.

ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ (58; 25 బంతుల్లో 5x4, 5x6) మెరుపు హాఫ్‌ సెంచరీ బాదేశాడు.

సూర్యకుమార్‌ యాదవ్‌ (43; 25 బంతుల్లో 4x4, 3x6) మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు.

కేకేఆర్‌లో వెంకటేశ్ అయ్యర్‌ (104; 51 బంతుల్లో 6x4, 9x6) అమేజింగ్‌ సెంచరీ కొట్టేశాడు.

మెక్‌కలమ్‌ తర్వాత కేకేఆర్‌లో సెంచరీ కొట్టిన రెండో ఆటగాడిగా అవతరించాడు.

ఆఖర్లో ఆండ్రీ రసెల్‌ (21;11 బంతుల్లో 3x4, 1x6) మెరిశాడు.

'మేం కొడితే వాళ్లూ వీళ్లూ చెప్పుకోవడమే కానీ మాకూ తెలియదు' అన్నట్టుగా ఆడింది... ముంబయి ఇండియన్స్‌!

తిలక్‌ వర్మ (30; 25 బంతుల్లో) సూర్య మూడో వికెట్‌కు 38 బంతుల్లో 60 రన్స్ పాట్నర్ షిప్ చేశారు.